Reading Time: < 1 minute

రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసిన ఎయిర్ టెల్.. పాపం కస్టమర్లు..!

Caption of Image.

మన దేశంలోనే విస్తృతమైన నెట్ వర్క్ ఉన్న రెండో టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్ టెల్ మరోసారి ప్రీపెయిడ్ ప్లాన్లను సవరించింది. ప్రీపెయిడ్ ప్లాన్ ధరలు పెంచడంతో ఎయిర్టెల్ యూజర్లకు రీఛార్జ్ మరింత భారం కానుంది. ఎయిర్‌టెల్లో ఇప్పటివరకూ రూ. 799 ప్లాన్‌ ఉండేది. ఈ ప్లాన్ను ఎయిర్ టెల్ కంపెనీ తొలగించింది. అంతేకాదు.. రూ. 859 రీఛార్జ్ ప్లాన్ ధరను కూడా పెంచింది. ఇప్పుడు 859 రూపాయల నుంచి ఆ ప్లాన్ ధర రూ. 899కు పెరిగింది. ఇంతకు ముందు రూ. 799, రూ. 859 ప్లాన్‌లు..  77 రోజులు, 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB, 2GB డేటాను అందించేవి.

ఇప్పుడు.. 84 రోజుల వ్యాలిడిటీ కోసం రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు రోజుకు 1.5GB డేటా కావాలంటే రూ. 899 ప్లాన్‌ను ఎంచుకోక తప్పని పరిస్థితి. డైలీ 2జీబీ డేటా కావాలంటే.. రూ. 1,029 చెల్లించి 84 రోజుల పాటు డేటాను పొందవచ్చు. 84 రోజుల ప్లాన్‌ కావాలనుకునే కస్టమర్లు.. రూ. 1,029 ప్లాన్‌ను ఎంచుకోవడం బెటర్. ఎందుకంటే.. ఈ ప్లాన్లో 84 రోజుల పాటు అపరిమిత 5Gతో పాటు రోజుకు 2GB డేటా వస్తుంది. అపరిమిత లోకల్, STD, రోమింగ్ కాల్స్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు జియోహాట్‌స్టార్ మొబైల్ ప్లాన్ కూడా పొందొచ్చు.

►ALSO READ | ఆల్కహాల్‌తో నడవనున్న కార్లు, బైక్స్: E85 పెట్రోల్ తెస్తున్న ప్రభుత్వం.. మరి పాత వాహనాల పరిస్థితి?

©️ VIL Media Pvt Ltd.