Reading Time: < 1 minute

అమరావతి: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సంక్రాంతి వేళ పెను విషాదం చోటుచేసుకుంది. జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 40 పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. గ్రామస్థులంతా పండగ సరుకుల కోసం తుని వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, తిరిగి వచ్చేసరికి ఇళ్లు, ధాన్యం, నగదు అన్నీ మంటల్లో కలిసిపోయి 120 మంది నిరాశ్రయులయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ లీక్ కారణంగానే మంటలు వ్యాపించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.