Reading Time: < 1 minute

పారిస్: భారత విదేశాంగ మంత్రి జై శంకర్ శుక్రవారం ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో సమావేశం అయ్యారు. ఫ్రాన్స్, లక్సెంబర్గ్‌లలో ఆరు రోజుల పర్యటనలో భాగంగా జైశంకర్ శుక్రవారం పారిస్ చేరుకున్నారు. ముందుగా ప్రెసిడెంట్ మెక్రాన్‌తో పలు అంతర్జాతీయ సమకాలీన పరిణామాలపై చర్చించారు. భారత్ , ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య బంధంపై ఫ్రాన్స్ అధ్యక్షుల సముచిత వైఖరిని జైశంకర్ కొనియాడారు. తాము ప్రధాని నరేంద్ర మోడీ తరఫున ప్రెసిడెంట్‌కు శుబాకాంక్షలు తెలిపారు. తన సమావేశ వివరాలను సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఇక్కడ అంబాసిడర్స్ కాన్షరెన్స్ ఆప్ ప్రాన్స్‌లో పాల్గొనడం తనకు ఆనందం కల్గించిందని జైశంకర్ స్పందించారు.