
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంచాయితీ సుప్రీంకోర్టులో వాడీవేడీ గా వాదనలు జరిగాయి. తాజాగా పోలవరం -నల్లమలసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సు ప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం వద్ద సోమవారం వి చారణ జరిగింది.ఏపీ నిర్మిస్తున్న పోలవరం -నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు కేసు విచారణ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం లోని ధర్మాసనం ఎదుట జరిగింది. తొలుత ఏపీ ప్రభు త్వం తరపున న్యాయవాది జగదీశ్ గుప్తా వాదన లు వినిపించారు. పోలవరం ప్రాజెక్టు నివేదిక, అధ్యయనానికి కేంద్రం నుంచి అనుమతి ఉందని తెలిపారు. ఇందుకు సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అందరి అ భిప్రాయాలతోనే తదుపరి విచారణ కొనసాగిస్తామని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు కదా అని సీజేఐ
ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం వరద జలాలే వాడుకుంటామని చెబుతోందని, కేటాయింపులకు విరుద్ధంగా నీటి వినియోగం సాధ్యపడదని వివరించారు. ఇందుకు సంబంధించి చాలా విషయాలు ముడిపడి ఉన్నాయని సింఘ్వీ కోర్టుకు తెలిపారు. విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, ప్రాజెక్టులన్నీ ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్రం నియమించిన కమిటీ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ చేపట్టే ప్రాజెక్టు నివేదికపై కమిటీని ఏర్పాటు చేశారని తమరే చెబుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండని వ్యాఖ్యానించారు. సివిల్ సూట్‌లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా అని ప్రశ్నించారు. అయితే మధ్యంతర ఉపశమనం కల్పించాలని తెలంగాణ తరపున సింఘ్వీ కోరారు. ఇందుకు సీజేఐ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్ కేవలం ప్రాజెక్టు నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చూస్తోందని తెలిపారు. జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి న్యాయపరిధి ఉంటుందని సీజేఐ తెలిపారు. ఏపీ ప్రభుత్వం భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరమేంటని ఏపీ మరో లాయర్ ముకుల్ రోహిత్గి ప్రశ్నించారు. తన భూభాగంలో నిర్మించే ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుంటే అభ్యంతరం ఎందుకో చెప్పాలన్నారు. ఇందుకు పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని సీజేఐ సూచించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగదని ఇందుకు ముకుల్ సమాధానమిచ్చారు. గోదావరిలో వరద జలాల పేరుతో అసలు జలాలకు ఎసరు పెట్టాలని ఏపీ ప్రయత్నిస్తోందని సుప్రీంకోర్టులో తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. తెలంగాణ తరపున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ నల్లమల సాగర్ ద్వారా గోదావరి జలాల్లో అవార్డు ప్రకారం కేటాయించిన 480 టీఎంసీలకు మించి వాడుకునేందుకు ఏపీ యత్నిస్తోందన్నారు.
వరద జలాల పేరుతో నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 200 టీఎంసీలు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తు న్నదని చెప్పారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని, అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. వరద జలాలు అనేది ఎక్కడా లేదన్నారు. ముఖ్యంగా గోదావరి నదిలో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల నీటి వాటాకు ఈ ప్రాజెక్టు వల్ల ముప్పు పొంచి ఉందన్నారు. కేంద్ర జల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా ఏపీ పట్టించుకోవడం లేదు అని సింఘ్వీ వాదించారు. ఈ ప్రాజెక్టుపై తక్షణమే స్టే ఇవ్వాలని కోరారు. ఏపీ తరపున ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ ఈ ప్రాజెక్టు ఇంకాప్రాథమిక దశలోనే ఉందని, కేవలం డీపీఆర్, సర్వేల కోసం మాత్రమే టెండర్లు పిలుస్తున్నా మని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ వంటి కరవు ప్రాంతాలకు నీటిని అందించడమే తమ లక్ష్యమని ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలను వాడుకోవడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశాలను పరిశీలించాలని సూచిస్తూ తదుపరి విచారణ ను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు.