Reading Time: < 1 minute

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ తన పొత్తుల వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేంద్రహోం మంత్రి అమిత్‌షా , తన తాజా పర్యటనలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈసారి ఎన్నికల్లో కేవలం పోటీ చేయడం మాత్రమే కాకుండా పార్టీ గెలుపే లక్షంగా పనిచేయాలని ఆయన పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు మిత్ర పక్షం ఏఐఏడిఎంకేకు చెక్‌పెడుతూ కొత్త శక్తులతో కూటమి కట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.