Reading Time: < 1 minute
Lionel Messi: మెస్సీ కోల్‌కతా టూర్‌లో గందరగోళం.. చేర్స్‌, బాటిల్స్ విసిరిన ఫ్యాన్స్.. ఎందుకంటే?

గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా ప్రపంచ లెజెండ్ ఫుడ్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ శనివారం కోల్‌కతాలోని స్టాల్‌లేక్ స్టేడియానికి వచ్చారు. ఇక్కడ నిర్వహించిన గోట్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. అయితే మెస్సీ టూర్‌గో భాగంగా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించడంలో.. మెస్సీ మ్యాచ్‌ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన మెస్సీ ఎలాంటి మ్యాచ్‌ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ మ్యాచ్‌ చూద్దామని వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..స్టేడియంలోకి వాటర్‌ బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. ప్లేక్సీలు, కటౌట్‌లు చించేవారు. కొన్నింటించి అంటించేశారు.

దీందో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి ఫ్యాన్స్‌ను అడ్డుకున్నారు. ఇక ఘటనపై ఫ్యాన్స్ మాట్లాడుతూ.. మెస్సీని చూసేందుకు పక్క రాష్ట్రం నుంచి వచ్చామని.. ఒక్కో టికెట్‌ను రూ.5 నుంచి 45 వేల ఖచ్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటి కనీసం ఆయన్ను ప్రత్యక్షంగా చూడలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.