Reading Time: < 1 minute
PEDDI KI AAWAZ :భోపాల్‌లో రామ్ చరణ్ ‘పెద్ది కా ఆవాజ్’ గ్రాండ్ ఈవెంట్.. లైవ్ వీడియో మీకోసం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా పెద్ది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మే 18న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా పెద్ది కా ఆవాజ్ పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్, డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ సందర్భంలో పెద్ది సినిమాకు సంగీతం అందిస్తోన్న ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్పెషల్ షో ఉండనుంది. అలాగే పలువురు సినీ ప్రముఖలు కూడా ఈ గ్రాండ్ ఈవెంట్ లో సందడి చేయనున్నారు. ఇదే సందర్భంగా పెద్ది స్పెషల్ సాంగ్ ను కూడా లాంఛ్ చేయనున్నారు.