
హనుమకొండ సిటీ, వెలుగు : లబ్ధిదారులకు జాప్యం లేకుండా రుణాలను అందించాలని బ్యాంకర్లను హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ లో 2025- -26 వార్షిక సంవత్సరానికి గాను బ్యాంకులు ఇచ్చిన రుణాలపై బ్యాంకర్లతో జిల్లా స్థాయి సమీక్ష కమిటీ, జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ రుణ లక్ష్య సాధనకు సమన్వయం అవసరమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో హనుమకొండ జిల్లా రుణ లక్ష్యం రూ.15,484.29 కోట్లు కాగా, ఇందులో రూ.13733.74 కోట్ల రుణ లక్ష్యం సాధించినట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు అత్యధికంగా రుణాలు అందించడంలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చినందుకు డీఆర్డీఏ ఆఫీసర్లు, సిబ్బందిని అభినందించారు.