Reading Time: < 1 minute

తెలంగాణలో  రైల్వే, హైవేలకు కేంద్రం ప్రాధాన్యత  :  ఎంపీ గోడం నగేశ్

Caption of Image.

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : తెలంగాణలో రైల్వే, నేషనల్​ హైవేలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆదిలాబాద్​ ఎంపీ గోడం నగేశ్​ పేర్కొన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని బీజేపీ జిల్లా ఆఫీస్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు.

ఈ నెల 10న సికింద్రాబాద్​లో జరగనున్న ప్రధాని మోదీ పర్యటనను ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రోగ్రాంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్​ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు జీవీ మనోహర్​ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.