Reading Time: < 1 minute

మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలకు.. గోడకూలి నలుగురు రైతులు మృతి

Caption of Image.

మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. లక్షేట్టిపేటలో ఆకస్మాత్తుగా ఈదురుగాలులు, వర్షం కురవడంతో  రైతులు తలదాచుకుంటున్న షెడ్డు గోడకూలి నలుగురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు.  మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.  మరో ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. రైతుల అకాల మరణం పట్ల పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరాతీశారు. రైతుల మృతిపట్ట సంతాపం తెలిపారు. మృతిచెందిన రైతు కుటుంబాలను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

లక్షేట్టిపేటలో ఆకాల వర్షం, ఈదురుగాలులు రైతులను ఆగమాగం చేశాయి. ఈదురు గాలులకు కల్లాల్లో ఉన్న ధాన్యం కాపాడుకునేందుకు వెళ్లిన రైతులను ఆకాల వర్షం   మింగేసింది.  ఒక్కసారిగా ఈదురుగాలులు, వర్షం రావడంతో తలదాచుకునేందుకు కల్లాల సమీపంలో ఉన్న ఓ షెడ్డులోకి రైతులు వెళ్లారు.  ఆ సమయంలో ఈదురుగాలులు, వర్షానికి షెడ్డు గోడ కూలి రైతులపై పడింది. దీంతో  అక్కడున్న నలుగురు రైతులు స్పాట్ లోనే చనిపోయారు. మరో రైతులు తీవ్రంగా గాయాలయ్యాయి. 

మృతిచెందిన రైతులు  నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేష్, తనుగుల అభిరామ్ మృతి గా గుర్తించారు. మరో రైతు సీదుల హరీష్ అనే రైతుకు తీవ్రగాయాలయ్యాయి. 

©️ VIL Media Pvt Ltd.