Reading Time: 2 minutes

కేరళలో 13 మంది మంత్రుల ఓటమి… LDF కి కోలుకోలేని దెబ్బ ఇది..!

Caption of Image.

ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో UDF కూటమి ఘనవిజయం సాధించింది. UDF 102 స్థానాల్లో విజయం సాధించగా… 35 స్థానాలకే పరిమితమైన LDF ఘోర ఓటమి చవిచూసింది.ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఎన్డీయే 3 స్థానాలకే పరిమితమైంది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో 13 మంది సిట్టింగ్ మంత్రులు ఓడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. నేమోమ్ నియోజకవర్గం నుండి విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ఓడిపోవడం షాకింగ్ అనే చెప్పాలి. బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ చేతిలో 4 వేల 978 ఓట్ల తేడాతో ఓడిపోయాడు శివన్ కుట్టి.

2021లో శివన్‌కుట్టి బీజేపీ నుంచి పోటీ చేసి ఈ సీటును కైవసం చేసుకున్నప్పటితో పోలిస్తే ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పచ్చు.  చడయమంగళం నియోజకవర్గం నుంచి పశుసంవర్ధక శాఖ మంత్రి జె చించు రాణి.. యూడీఎఫ్ అభ్యర్థి ఎంఎం నసీర్ చేతిలో 7 వేల 486 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.

పఠానాపురంలో, రవాణా శాఖ మంత్రి గణేష్ కుమార్ యూడీఎఫ్ అభ్యర్థి జ్యోతికుమార్ చామక్కల చేతిలో 8వేల 310 ఓట్ల తేడాతో ఓడిపోయారు.ఆరన్ములలో ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్, యూడీఎఫ్ కు అభ్యర్థి అబిన్ వర్కీ చేతిలో 18వేల 985 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

►ALSO READ | ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందన

ఓడిపోయిన 13 మంది మంత్రులు వీరే:

విఎన్ వాసవన్ (దేవాదాయ శాఖ మంత్రి): ఎట్టుమానూరులో యుడిఎఫ్ అభ్యర్థి నట్టకం సురేష్‌ చేతిలో 19వేల 752 ఓట్లతో ఓడిపోయారు.

రోషీ అగస్టీన్ (జలవనరుల శాఖ మంత్రి): ఇడుక్కిలో రాయ్ కె పౌలోస్ చేతిలో 23వేల 822 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

పి. రాజీవ్ (పరిశ్రమల శాఖ మంత్రి): కలమస్సేరి నుండి వి.ఇ. అబ్దుల్ గఫూర్ చేతిలో 16వేల 312 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఆర్ బిందు (ఉన్నత విద్యాశాఖ మంత్రి): ఇరింజలకుడలో థామస్ ఉన్నియాదన్‌ చేతిలో 10 వేల 212 ఓట్లతో ఓడిపోయారు.

ఎం.బి. రాజేష్ (పంచాయితీరాజ్ శాఖ మంత్రి): త్రిథాలలో వి.టి. బలరామ్ చేతిలో 8వేల 385 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఏకే ససీంద్రన్ (అటవీ శాఖ మంత్రి): ఏలత్తూరులో విద్యా బాలకృష్ణన్ చేతిలో 12వేల 162 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అహ్మద్ దేవార్కోవిల్ (ఓడరేవుల శాఖ మంత్రి): కోజికోడ్ దక్షిణ స్థానం నుండి ఫైసల్ బాబు చేతిలో 10వేల 795 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఓఆర్ కేలు (ఎస్సీ/ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి): మానంతవాడిలో ఉషా విజయన్ చేతిలో 10వేల 543 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

కడన్నప్పల్లి రామచంద్రన్ (ఓడరేవుల శాఖ మంత్రి): కన్నూర్ స్థానంలో టి.ఓ. మోహనన్ చేతిలో 18,551 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
 

©️ VIL Media Pvt Ltd.