Reading Time: < 1 minute

విజయ్–త్రిష మ్యాటర్ లోనూ పుష్ప 2 సీన్ రిపీట్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్

Caption of Image.

దళపతి విజయ్ టీవీకే పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీలను దాటుకొని మెజార్టీ సీట్లు సాధించి కొత్త మార్పుకు శ్రీకారం చుట్టబోతుంది. విజయ్ సినిమాల ద్వారా ప్రజల హక్కులు, బాధ్యతలపై బలమైన సందేశాలు ఇస్తూ తన ఉనికిని చాటుకున్నారు. ఇపుడు ఓ సాధారణ పౌరుడిగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చి, అసాధారణ విజయాన్ని అందుకోవడంతో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

ఇదే సమయంలో, విజయ్ రూమర్ గర్ల్ ఫ్రెండ్ త్రిష పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఆసక్తికర ట్రెండ్ వైరల్ అవుతోంది. విజయ్ లీడ్‌ను త్రిష బర్త్‌డేతో లింక్ చేస్తూ నెటిజన్లు ఇంట్రెస్టింగ్ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప 2 లోని రిఫరెన్స్‌లతో క్రియేట్ చేసిన మీమ్స్ భారీగా ట్రెండ్ అవుతున్నాయి.

►ALSO READ | V S Babu.. తమిళనాడు సీఎం స్టాలిన్నే ఓడించిన.. విజయ్ పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు బ్యాగ్రౌండ్ ఇదే..!

పుష్ప 2 సినిమాలో సీఎం చేసే తేదీ గురించి రావు రమేష్ అడిగితే, “ఆ రోజు శ్రీవల్లి బర్త్‌ డే” అని పుష్ప రాజ్ చెప్పే సన్నివేశాన్ని పోల్చుతున్నారు. ఈ క్రమంలోనే “ఇవాళ ఏప్రిల్ 4న త్రిష బర్త్‌ డే కాబట్టి విజయ్ లీడ్‌ లోకి వచ్చారు” అంటూ ఆసక్తికర పోస్టులతో సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నారు. 

మొత్తానికి, రాజకీయ హీట్‌కు సినీ మసాలా, దానికి సోషల్ మీడియా క్రియేటివిటీ కలిసిపోవడంతో.. ప్రస్తుతం ఇది ఒక పెద్ద మీమ్ ఫెస్టివల్గా మారిపోయింది. ఇక ఎన్నికల ఫలితాలు మొత్తం వచ్చాక.. సోషల్ మీడియాలో ఇంకెలాంటి మీమ్స్ మొదలవుతాయో చూడాలి. 

©️ VIL Media Pvt Ltd.