
ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో జనగణనను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ దివాకర తెలిపారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ లో జనగణనపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి ప్రభుత్వ పథకం అర్హులైన వారికి పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొదటి దశ హౌస్ లిస్టింగ్ లో స్వీయ గణన మే 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం 2651 హౌస్ లిస్టింగ్ బ్లాకులు గుర్తించామని, ప్రతి బ్లాక్‌లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియ కోసం 2669 మంది ఎన్యుమరేటర్లు, 485 మంది సూపర్వైజర్లను నియమించామని తెలిపారు. అంతకుముందు ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి అర్జీలను స్వీకరించారు.