Reading Time: < 1 minute

హైదరాబాద్ లో వరుస దొంగతనాలు.. వ్యక్తి అరెస్ట్

Caption of Image.

జీడిమెట్ల, వెలుగు: రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లు, వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్​కు చెందిన మహ్మద్ సమీర్ ఖాన్ (24) విలాసవంతమైన జీవితం కోసం దొంగగా మారాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని ఆల్విన్ కాలనీలో కేటీఎం బైక్, శుభోదయ కాలనీలో జ్యూపిటర్ వాహనాన్ని దొంగిలించాడు. 

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం అతన్ని అదుపులోకి తీసుకుని, రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు ప్రాంతాల్లో చోరీ కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోలేదని పోలీసులు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.