
హైదరాబాద్: భాగ్యనగరంలోని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలిచౌకి లో నైస్ జ్యూస్ సెంటర్ లో ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. నైస్ జ్యూస్ సెంటర్ లో బీహార్ కు చెందిన మోఫిల్ (19), దుర్వేశ్ (16) పని చేస్తున్నారు. ఇద్దరు మధ్య గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన మోఫిల్ ఒక గరిట తీసుకొని దుర్వేశ్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.