
God Of War : ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతోంది. వీరి కలయికలో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God Of War) అనే వర్కింగ్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అనౌన్స్‌మెంట్ రాకముందే ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌తో పాటు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
లార్డ్ కార్తికేయ కథాంశంతో మైథలాజికల్ ఎపిక్
ఈ సినిమా పురాణాల నేపథ్యంతో కూడిన ఒక పవర్ ఫుల్ మైథలాజికల్ ఎపిక్‌గా తెరకెక్కనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. లార్డ్ కార్తికేయ (సుబ్రహ్మణ్య స్వామి) కథ ఆధారంగా ఈ చిత్రాన్ని మలచబోతున్నారని, ఇందులో ఎన్టీఆర్ ఒక దైవిక యోధుడి (డివైన్ వారియర్) పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు, కథనానికి ఎన్టీఆర్ నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని భావిస్తున్నారు.
షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుంది?
ఈ భారీ విజువల్ వండర్ కోసం మేకర్స్ విస్తృతమైన ప్రీ-ప్రొడక్షన్ పనులను ప్లాన్ చేస్తున్నారు. 2027 మార్చి తర్వాత ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగవంతం కానున్నాయి. గ్రాఫిక్స్, స్క్రిప్ట్ వర్క్ , ఆర్ట్ వర్క్ పూర్తయిన అనంతరం, 2027 ద్వితీయార్థంలో (సెకండ్ హాఫ్) ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది.
ఎన్టీఆర్ హెల్త్ అప్‌డేట్ అండ్ లైన్అప్
ఇటీవల జరిగిన ఒక ఘటనలో ఎన్టీఆర్ భుజానికి స్వల్ప గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఎన్టీఆర్ మొదట తన ప్రస్తుతం ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (Dragon) షూటింగ్‌ను పూర్తి చేయనున్నారు. ఆ సినిమా పనులు ముగిసిన వెంటనే పూర్తిగా ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారు.