Reading Time: < 1 minute

ఎల్ బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్ బినగర్ ప్రాంతం సాగర్ రింగ్ రోడ్డుకు సమీపంలో హస్తినాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఇద్దరు బీటెక్ విద్యార్థులతో పాటు మరో వ్యక్తిగా గుర్తించారు. కారు అతివేగంగా దూసుకొచ్చి బైకును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహావీర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.