Reading Time: < 1 minute

చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగికి 2003 నాటి హత్యకేసులో యావజ్జీవ ఖైదు శిక్ష వెలువడింది. ఎన్‌సిపి ప్రముఖ నేత రామావతార్ జగ్గి హత్యోదంతంలో రాష్ట్ర హైకోర్టు సోమవారం ఈ తీర్పు ప్రకటించింది. అంతకు ముందు ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. అయితే కేసు పూర్వాపరాల విచారణ తరువాత హైకోర్టు 2007 నాటి ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేసింది. రు. జీవిత ఖైదు విధించిన తరువాత అజిత్ జోగి మూడువారాలలో సరెండర్ కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోశాధికారి, రాజకీయాల్లోకి వచ్చిన వ్యాపారి రామావతార్ జోగిని 2003 జూన్ 4వ తేదీన రాయ్‌పూర్‌లో కాల్చి చంపారు.

అప్పుడు అజిత్ జోగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజకీయ కుట్రతోనే ఈ హత్య జరిగిందని పేర్కొంటూ ఈ కేసులో జోగితో పాటు పలువురిని నిందితులుగా చేర్చారు. 2007లో సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 28 మందిని దోషులుగా ఖరారు చేసింది. వారికి యావజ్జీవ శిక్షలు విధించారు. అయితే అమిత్ జోగిని నిర్దోషిగా ప్రకటించారు. ఈ తీర్పును సిబిఐ ఉన్నసవాలు చేసింది. దీర్ఘకాలిక వాద ప్రతివాదాలు, విచారణ తరువాత ఇప్పుడు రెండు దశాబ్దాలపై దశలో హైకోర్టు తీర్పు వెలువడింది.హైకోర్టు తీర్పు పట్ల రామావతార్ జగ్గి కుమారుడు సతీష్ హర్షం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా వేచిచూసిన న్యాయం ఇప్పటికి దక్కిందని , ఇప్పుడు తన తండ్రికి నిజమైన నివాళి అందిందని స్పందించారు. తీర్పును స్వాగతించారు.