
అబుదాబిపై శనివారం జరిగిన ఒక బాలిస్టిక్ క్షిపణి దాడిని యూఏఈ రక్షణ దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి. అయితే, ఆ క్షిపణిని గాలిలోనే కూల్చివేసినప్పుడు, దాని శిథిలాలు కింద పడటంతో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు.
ఈ ఘటన అబుదాబిలోని ఖలీఫా ఎకనామిక్ జోన్ (KEZAD) సమీపంలో జరిగింది. గాయపడిన వారికి స్వల్పంగా దెబ్బలు తగిలాయని, ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు.
క్షిపణి ముక్కలు పారిశ్రామిక ప్రాంతంలో పడటంతో రెండు చోట్ల మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
క్షిపణి ఎక్కడి నుండి వచ్చిందనే వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని, కేవలం ప్రభుత్వ సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని కోరారు.
యూఏఈ ప్రభుత్వం గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది. ఏదైనా సమాచారం కోసం కేవలం అధికారిక ప్రభుత్వ వర్గాలపైనే ఆధారపడాలని యూఏఈ అధికారులు ప్రజలను కోరారు… పుకార్లను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు.