Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం:  రేపు ( మార్చి 29 ఆదివారం) ఏ దేవుడిని పూజించాలి.. ఎందుకు..ఎలా.. పూజించాలి.. ఎలాంటి ఫలితం వస్తుంది…!  

Caption of Image.

హిందూ మతంలో ఏకాదశి ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి నెలకు రెండు సార్లు వస్తుంది. ఏకాదశి ఉపవాసం ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో వస్తుంది. ఈ ఉపవాసానికి అనేక నియమాలు కూడా ఉన్నాయి, వాటిని పాటించాల్సిన అవసరం ఉంది. ఏడాది పొడవునా వచ్చే ప్రతి ఏకాదశికి వేరే వేరు పేర్లు ఉంటాయి.  ఇప్పుడు  చైత్రమాసం.. శుక్ల పక్షంలో వచ్చే కామద ఏకాదశి గురించి తెలుసుకుందాం.

తెలుగు సంవత్సరం.. తొలిమాసం.. చైత్రమాసం.. శుక్లపక్షంలో  వచ్చే ఏకాదశికి  కామద ఏకాదశి అని పేరు. ఈ ఏడాది ( 2026) మార్చి 29 ఆదివారం ఏకాదశి వచ్చింది.ఏకాదశి రోజున  విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజిస్తారని చెబుతారు. ఏకాదశి ఉపవాసాన్ని నిజమైన హృదయంతో పాటించే వ్యక్తి యొక్క ప్రతి కోరికను విష్ణుమూర్తి నెరవేర్చుతాడని నమ్ముతారు. 

కామద అంటే ఏమిటి?

ప్రతి ఏకాదశి పేరుకు దానితో ఏదో సంబంధం ఉంటుంది. కామద  అంటే కోరికలను నెరవేర్చేది అని అర్ధం. ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.  

కామద ఏకాదశి తేదీ.. పూజా సమయం

కామద ఏకాదశి తేదీ గురించి కాస్త గందరగోళం నెలకొంది. వాస్తవానికి తేదీల విషయంలో కన్ఫ్యూజన్ అప్పుడప్పుడు ఉంటుంది. 

  • కామిక ఏకాదశి తిథి ప్రారంభం:  మార్చి 28వ తేదీ ఉదయం 08:45 గంటలు
  • కామిక ఏకాదశి తిథి ముగింపు:  మార్చి 29 ఉదయం 07:46 గంటలకు వరకు
  • ఉపవాస వ్రతం : ఉదయ తిథి ప్రకారం.. మార్చి 29న
  • పూజా సమయం : మార్చి 29 ఉదయం 7:48 నుంచి మధ్యాహ్నం 12:26 వరకు
  • ఉపవాస విరమణ సమయం:మార్చి 30 సోమవారం ఉదయం 6.14 నుంచి 7.09 గంటల మధ్యలో 

ఏకాదశి పూజకు కావలసినవి

  • విష్ణుమూర్తి చిత్రపటం లేదా విగ్రహం 
  • పసుపు బట్టలు 
  • పసుపు పువ్వులు 
  • తులసి దళాలు
  • అగర్​బత్తీలు
  • సాంబ్రాణి
  • గంధం
  • అక్షింతలు
  • పసుపు
  • కుంకుమ
  • తమలపాకు

ఏకాదశి పూజా విధానం 

  • ఉదయాన్నే లేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించండి.
  • ఏకాదశి రోజున పసుపు రంగు ధరించడం శుభప్రదమని నమ్ముతారు.
  • పూజ గదిని శుభ్రం చేయాలి. గంగా నీటితో శుద్ధి చేయండి.
  •  ఉపవాసం చేసేందుకు కావలసిన శక్తిని ఇమ్మని స్వామి ఎదుట ప్రతిఙ్ఞ
  • పీటపై వస్త్రం వేసి బియ్యం పోసి దానిపై విష్ణుమూర్తి చిత్రపటం  లేదా విగ్రహం
  • దీపారాధన చేసి షోడశోపచారాలతో విష్ణువుని పూజించండి.
  • విష్ణువుకి పసుపు పువ్వులు, తులసి దళాలను సమర్పించండి. చివరగా హారతి, నైవేద్యం కూడా సమర్పించండి.
  • రోజంతా ఉపవాసం ఉండి, మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసం విరమించాలి
©️ VIL Media Pvt Ltd.