
బోథ్, వెలుగు: బోథ్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అన్నారు. శుక్రవారం బోథ్ పట్టణంలో నిర్వహించిన పలువురు ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల్లో ఆయన పాల్గొన్నారు. పేదలందరికీ గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అన్నపూర్ణ మహేందర్, బోథ్ బ్లాక్ ఆత్మ కమిటీ చైర్మన్ రాజు యాదవ్, మాజీ ఎంపీటీసీ, పీఏసీఎస్ డైరెక్టర్ఉమేశ్, ఆత్మ డైరెక్టర్ రహిమొద్దీన్, నాయకులు అచ్యుత్రెడ్డి, సన్నీరెడ్డి, సద్దాం, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోతరెడ్డి పాల్గొన్నారు.