Reading Time: < 1 minute

వాటర్ బోర్డు పేరుతో నీళ్లు సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు.. ప్రైవేట్ట్యాంకర్లకు ఎండీ వార్నింగ్

Caption of Image.

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాటర్​బోర్డు లోగోను ప్రైవేట్​ట్యాంకర్లు నడిపే వారు వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై క్రిమినల్​చర్యలు తీసుకుంటామని ఎండీ అశోక్​రెడ్డి హెచ్చరించారు. వాటర్​బోర్డు పేరు, లోగో, బ్రాండ్​ను ఉపయోగిస్తూ కొంతమంది ప్రైవేట్ బోర్‌‌వెల్ ట్యాంకర్ ఆపరేటర్లు నీటి సరఫరా చేయడంపై ఫైర్​అయ్యారు. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు బోర్‌‌వెల్స్​నుంచి తీసుకుంటారని, ఆ నీటిని వాడడం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. తమ టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి నీటిని బుక్​చేసుకోవాలన్నారు. 

©️ VIL Media Pvt Ltd.