Reading Time: < 1 minute
Cross Fire: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో టీవీ9 క్రాస్‌ఫైర్‌

హైడ్రా చర్యలపై వస్తున్న విమర్శల నడుమ కమిషనర్ రంగనాథ్ టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్‌తో జరిగిన క్రాస్‌ఫైర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారనే ఆరోపణలను ఆయన ఖండిస్తూ, చెరువుల కబ్జాలను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా వచ్చిన తర్వాత వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయనే విమర్శలపై స్పందించిన ఆయన, బస్తీల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు. అక్రమంగా పర్మిషన్లు తీసుకొని పేదలను మోసం చేస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అభివృద్ధి పనులు చేపడితే ప్రారంభంలో వ్యతిరేకత సహజమని, కానీ పూర్తయ్యాక ప్రాంతాలు అందంగా మారతాయని పేర్కొన్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించామని రంగనాథ్ వెల్లడించారు.