
మనతెలంగాణ/హైదరాబాద్ : రేవంత్ రెడ్డి తన గురువు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని బిఆర్‌ఎస్ నేత, శాసనమండలి మాజీ విప్ కర్నె ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రం రావణ కాష్టం కావాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ది జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై భాద్యత గల ప్రతిక్షంగా ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు.
తాము ప్రశ్నిస్తుంటే సిఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం మొదలు పెట్టారని ఆరోపించారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ను తిడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 700 రోజులైనా సిఎంలో మార్పు రాలేదని, తమను తిట్టి సిఎం రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం వ్యాఖ్యలపై కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, జీవన్ రెడ్డి, హన్మంతరావు లాంటి స్పందించాలని అన్నారు. రేవంత్ రెడ్డి హర్వర్డ్ నుంచి మంచి నాయకత్వ లక్షణాలతో వస్తాడనుకుంటే..పిచ్చి ముదిరినట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.