Reading Time: < 1 minute

భువనేశ్వర్: చెరువులో మునిగిపోతున్న యువకుడిని ఎస్‌ఐ కాపాడిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతం రూర్కెల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపబందుపల్లి గ్రామంలోని చెరువులో యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూతవేటు దూరంలో ఉన్న ఎస్‌ఐ సిన్మయ్ బాల్ అక్కడికి చేరుకొని చెరువులోకి దూకి యువకుడిని బయటకు తీసుకోచ్చాడు. ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడని ఎస్‌ఐకి అతడి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు తెలిపారు.  సదర ఎస్ఐ నిజమైన హీరో అని, అతని ధైర్యసాహసాలు, విధి పట్ల అంకితభావం, మరొకరిని రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టడం గొప్ప విషయమని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.