Reading Time: < 1 minute

అమరావతి: టిడిపి ఎంఎల్‌ఎ ఇంటి ముందు మంత్రించిన నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తెల్ల అవాలు విసిరేసి కారులో పారిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అరవింద్ నగర్‌లో శింగనమల ఎంఎల్‌ఎ బండారు శ్రావణి నివసిస్తున్నారు. శనివారం ఉదయం టిడిపి ఎంఎల్‌ఎ శ్రావణి ఇంటి ముందు మంత్రించిన నిమ్మికాయలు, పసుపు, కుంకుమ, తెల్ల అవాలు విసిరేసి పారిపోయాడు. సెక్యూరిటీ సిబ్బంది కారును పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పటికే కారులో వారు పారిపోయారు. గన్‌మెన్లు, కార్యాలయ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సిసి ఫుటేజీని పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎపి 39 కెఎక్స్ 0986 అనే నంబర్ కారు గుంటూరు జిల్లాకు చెందిన మొగలి ఆదిలక్ష్మీ పేరు ఉంది.