
స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్, సలార్‌ల తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్…- ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తుండగా మలయాళ నటుడు, హీరో టొవినో థామస్ మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో కన్నడ సోయడం రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. డ్రాగన్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ను కీలక యాక్షన్ ఘట్టాలతో ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్‌ను జోర్దాన్‌లో చేయబోతున్నారు. ఇందులో మలయాళ యంగ్ హీరో టొవినో థామస్, ఎన్టీఆర్ పాల్గొనగా హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ షూట్ చేసే హై ఓల్టేజ్ యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. మేకర్స్ ఇక్కడే మూడు విభిన్నమైన భారీ హై ఓల్టేజ్ యాక్షన్ ఘట్టాలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్, టొవినో థామస్ పాల్గొనే ఈ భారీ యాక్షన్ షెడ్యూల్ ఆదివారం నుంచి జోర్డాన్‌లో ప్రారంభం కానుందని తెలిసింది.