
రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మాతలుగా అద్వైత్ నాయర్ తెరకెక్కించిన చిత్రం ‘చథా పచ్చ : ది రింగ్ ఆఫ్ రౌడీస్’. మలయాళంలో విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ఈ మూవీని తెలుగులో ఫిబ్రవరి 13న సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రోషన్ మాథ్యూ మాట్లాడుతూ “మలయాళంలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అద్వైత్‌కి ఇది మొదటి చిత్రం. ఇందులో ఓ స్పెషల్ కేమియో క్యారెక్టర్ ఉంది. ఆ పాత్రకి మమ్ముట్టిని సంప్రదించడం, ఆయన అంగీకరించడం గొప్ప విషయం. ఆయన పాత్ర ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్‌కి కూడా మా మూవీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితో కలిసి ఈ మూవీని చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ప్రవీణ్ మాట్లాడుతూ స్పోర్ట్ డ్రామాతో తెరకెక్కించిన ‘చథా పచ్చా’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ్ నాయర్, ఇషాన్ పాల్గొన్నారు.