
పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పోచారం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మౌనిక (36), నవీన్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పటాన్‌చెరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో హరిప్రసాద్, హర్ష, అమృత, సుశ్రుత తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో సుశ్రుత పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోరంపేటకు చెందిన వీరంతా జూ పార్క్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.