Reading Time: < 1 minute

కర్ణాటక రాష్ట్రంలోని ‘జంగల్ లాడ్జిస్‘ తరహాలో తెలంగాణలో తన ఎకో టూరిజం బ్రాండ్‌కు ‘డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్’ అనే పేరుతో ట్రెక్కింగ్, బర్డ్ వాక్స్, నైట్ క్యాంప్స్, జంగల్ కాటేజెస్‌లో బస, సఫరీ, అడవిలో ‘బుష్ బ్రేక్ఫాస్ట్’ వంటి వినూత్న కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ప్రారంభించింది. దీనిలో భాగంగా భాగంగా అటవీ అభవృద్ధి సంస్థ – ది బ్రీజ్ అనంతగిరి హిల్స్ – వికారాబాద్‌లో జంగల్ కాటేజెస్ నిర్మించి, అటవీ విజ్ఞాన శాస్త్రం చదివిన, హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన వారిని ఈ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్ – ఎకో టూరిజం విభాగంలో ఒక నెల పాటు అడవులు, వృక్ష వైవిద్యం, జంతు విజ్ఞానం, వాటి సంరక్షణ, హాస్పిటాలిటీ వంటి అంశాల మీద నైపుణ్యం పెంచి వారిని ‘నేచురలిస్ట్’లు గా నియమిస్తారు. ది బ్రీజీ ని ముందుగా గెస్ట్‌లు – వ్బ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకు గాను పలు ప్యాకేజీలతో కూడిన ధరలు అందుబాటులో ఉంచింది. మిగిలిన వివరాలకు అటవీ అభివృద్ధి సంస్థ, డెక్కన్ వుడ్స్ అండ్ ట్రయిల్స్ సంస్థలను సంప్రదించాలని సూచించింది.