
- తెగని ఎపి, తెలంగాణ ఉద్యోగుల పంచాయితీ?
- అటకెక్కిన కమల్‌నాథన్ కమిటీ సూచనలు
- తెలంగాణలో పనిచేస్తూ ఎపికి వెళ్లడానికి సుముఖంగా లేని 1,300 మంది ఉద్యోగులు
- ఎపి నుంచి రావడానికి 1,808 మంది ఉద్యోగులు సిద్ధం
- మిగతా 1,025 మంది ఉద్యోగులకు తెలంగాణ స్థానికత లేదు
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి, తెలంగాణ ఉద్యోగు ల పంచాయితీ తేలడం లేదు. ప్రస్తుతం 1,808ల మంది ఉద్యోగులు ఎపి నుంచి తెలంగాణకు రావాల్సి ఉండగా, తెలంగాణలో పనిచేసే ఎపికి చెందిన 1,300ల మంది ఉ ద్యోగులు ఎపికి వెళ్లాల్సి ఉంది. అయితే, తెలంగాణలో ప నిచేసే 1,300ల మంది ఉద్యోగులు ఎపికి వెళ్లడానికి సు ముఖంగా లేకపోవడం, ఎపి నుంచి వచ్చే వారిలో కొంద రు తెలంగానేతరులు కావడంతో ఈ అంశం ప్రస్తుతం పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఇరు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నాయకులు ఈ అంశంపై ఇ రు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నా ముం దుకెళ్లడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే, తెలంగాణలో పనిచేసే ఎపి ఉద్యోగు లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని, ఎపి నుంచి తెలంగాణకు రావాల్సిన ఉద్యోగుల్లో చాలామంది తెలంగానేతరులు ఉ న్నారని ఈ విషయంలో అన్ని నిబంధనలు పరిశీలించిన తరువాతే అధికారులు ఉద్యోగుల పంపకాలు జరపాలని ఉద్యోగ సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ఈ 1,808 మంది ఉద్యోగుల్లో చాలామంది తెలంగాణ వా రు కాదని అందరిని తెలంగాణకు తీసుకుంటే తెలంగాణ ఉద్యోగుల సీనియార్టీలో నష్టం జరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు అభ్యంతరం చెప్పడంతో ప్రస్తుతం ఈ అంశాన్ని పక్కన పెట్టినట్టుగా తెలిసింది. ఈ బదిలీల్లో స్పౌస్, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులకు సంబంధించిన బదిలీలు ఉండడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.
సచివాలయంలో జాయినింగ్ రిపోర్టు ఇచ్చిన 14 మంది ఉద్యోగులు
శుక్రవారం ఏపి నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చిన 14 మంది ఉద్యోగులకు తెలంగాణలోని వివిధ విభాగా ల్లో పోస్టింగ్‌లను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఎపి నుంచి వచ్చిన 14 మంది ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో శుక్రవారం రిపోర్టు చేశారు. 12 ఏళ్ల తరువాత వారిని తెలంగాణకు కేటాయించడంతో వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2024లోనూ 125మంది ఉద్యోగులు ఎపి నుంచి తెలంగాణ కేటాయి ంచడంతో వారికి ప్రభుత్వం పోస్టింగ్ కూడా ఇచ్చింది.
2,314 మంది ఉద్యోగుల పంపకం పూర్తి
2014కు ముందు (ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు) కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగులకు సంబంధించి విధి, విధానాలను రూపొందించింది. రాష్ట్ర స్థాయి పోస్టుకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కమల్‌నాథ్ క మిటీ ఆప్షన్‌లు ఇవ్వాలని సూచించింది. మిగతా ఉద్యోగులైన జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలని కమల్‌నాథ్ కమిటీ సూచించింది. అయితే కమల్‌నాథన్ కమిటీ సూచనల మేరకు ఈ 12 సంవత్సరాల్లో ఇరు రాష్ట్రాల అంగీకారంతో 2,314 మంది ఉద్యోగుల పంపకం జరిగింది. అయితే 2,300 మందిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న 1,500 మంది ఉద్యోగులు, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు 700ల మంది సైతం ఉన్నారు.
నాలుగేళ్ల క్రితం ఎపికి పంపించడానికి లేఖ రాసిన తెలంగాణ
అయితే తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం దీనికి సం బంధించి 1896 సర్యులర్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని అప్పటి ఎపి ప్రభుత్వ సిఎస్‌కు తెలియచేస్తూ ఒక లేఖ రాసింది. తెలంగాణలో ఎపి స్థానికతతో పనిచేస్తున్న వారి వివరాలను తెలియచేస్తూ వారిని ఎపికి పంపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో తెలిపింది.
ఎపిలో పని చేసే 783 మంది తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు
అయితే, ఎపి నుంచి తెలంగాణకు రావాల్సిన వారిలో 1,808 ఉద్యోగులు ఉండగా అందులో తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు సుమారుగా 783 ఉంటారని, మిగతా 1,025 మంది ఉద్యోగులకు తెలంగాణకు సం బంధం లేదని అయినా వారిని తెలంగాణకు పంపుతామ ని ఎపి ప్రభుత్వం 15128 సర్కులర్‌ను జారీ చేయడం తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో తెలంగాణకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు దా నిని వ్యతిరేకించారు. తాము తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను మాత్రమే రాష్ట్రానికి రావడానికి సమ్మతిస్తామని వారు అప్పటి ప్రభుత్వంతో తెగేసి చెప్పారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కనబెట్టింది.