Reading Time: < 1 minute

కొలంబో: టి20వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ గెలిచింది. నెదర్లాండ్స్ పై మూడు వికెట్ల తేడా పాక్ ఘన విజయం సాధించింది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి నెదర్లాండ్స్ 147 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో సాహిబ్జాదా పర్హాన్ (47), ఫహీమ్ అష్రఫ్ (29), సయిబ్ అయుబ్ (24) సల్మాన్ అఘా(12), బాబర్ అజమ్(15) పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో అర్యాన్ దత్, పౌల్ వ్యాన్ మీకెరన్ చెరో రెండు వికెట్లు తీయగా లగాన్ వ్యాన్ బీక్, కైయిల్ క్లేయిన్ రోలోప్ వ్యాండర్ మెర్వె తలో ఒక వికెట్ తీశారు.