Reading Time: < 1 minute

ఢిల్లీ: కొన్ని రంగాల్లో సున్నా శాతం సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, యంత్రాల ఎగుమతులకు గొప్ప అవకాశం అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్రేడ్ డీల్ గురించి ఏడాదిపాటు చర్చలు జరిగాయని, భారత వస్తువులపై అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి టారిఫ్ లు తగ్గించిందని, అమెరికాకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై భారత్ సున్నా సుంకాలు విధించిందని పీయూష్ గోయల్ తెలియజేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ తో భారత రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం లేదని, రైతులకు, వ్యవసాయానికి ఈ డీల్ రక్షణ కవచంగా మారిందని అన్నారు. ఒప్పందం నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులకు మినహాయింపు అని అన్నారు. వరి,సోయాబీన్, మొక్కజొన్న, రాగి ఉత్పత్తులకు నష్టం లేదని, డెయిరీ ఉత్పత్తుల దిగుమతికి అనుమతి లేదని, చీజ్, గ్రీన్ టీ, కాబూలీ చనా, పెసరపప్పుకు అనుమతి లేదని సూచించారు. చిన్నపరిశ్రమలకు ఎలాంటి నష్టం కలగదని, అమెరికాతో ఒప్పందం వల్ల హస్తకళలు, చేతివృత్తుల వారికి లాభం అని.. చాలా కూరగాయలు, విత్తనాలకు టారిఫ్ లేదని అన్నారు. అమెరికా నుంచి కొనే పారిశ్రామిక వస్తువులపై భారత్ లో సుంకాలు ఉండవని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.