Reading Time: < 1 minute

ముంబై: ఐసిసి అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత యువ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. ఇంగ్లండ్‌ను 311 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలిచి.. ట్రోఫీని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచక్ విజేత జట్టుకు బిసిసిఐ భారీ నజరానాను ప్రకటింది. భారత జట్టుకు రూ.7.50 కోట్లు నగదు బహుమతిని ప్రకటిచింది.

ఈ విషయాన్ని దేవ్‌జిత్ సైకియా వెల్లడించారు. ‘‘అండర్-19 వరల్డ్ కప్ యువ భారత్ విజయం సాధించడంపై యావత్ దేశం, బిసిసిఐ గర్వంగా ఉంది. ఫైనల్‌ల్ ఇంగ్లండ్‌ను ఓడించారు. ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ప్రపంచకప్‌ సొంతం చేసుకున్న తీరు అద్భుతం. బిసిసిఐ ఈ జట్టుకు రూ.7.50 కోట్లు నగదు బహుమతిగా ప్రకటిస్తోంది’’ అని సైకియా తెలిపారు.