
కొలంబో: టి20వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్-నెదర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. నెదర్లాండ్ జట్టు 17 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 134 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స్కాట్ ఎడ్వర్డ్(37) మైకెల్ లెవిట్(24), మ్యాక్స్ ఓడోడ్(05), బాస్ ది లీడీ(30), కోలిన్ అకెర్మన్(20), జాక్ లైన్ కాచెట్ (09) పరుగులతో బ్యాటింగ్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో లగ్వాన్ బీక్(0), వన్ డేర్ మార్వే(0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. పాక్ బౌలర్లలో మహ్మద్ నవాజ్, అబ్రార్, సయిమ్ అయుబ్ తలో రెండు వికెట్లు తీయగా సల్మాన్ మిర్జా ఒక వికెట్ తీశారు.