Reading Time: < 1 minute

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత-అమెరికా మధ్య శనివారం సాయంత్రం మ్యాచ్ జరగనుంది. భారత జట్టు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ దూరం కానున్నాడు. బుమ్రాకు వైరల్ ఫీవర్ సోకండంతో ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని తెలుస్తోంది. వాంఖేడ్ స్టేడియంలో జరిగిన టీమిండియా ట్రైనింగ్ సెషన్‌కు అతడు హాజరకాలేదు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటికీ భారత జట్టులో చేరలేదు. పిట్‌నెస్ క్లియరెన్స్ కోసం అతడు ఎదురు చూస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో వార్మఫ్ మ్యాచ్ జరుగుతుండగా హర్షిత్ రాణాకు మోకాలికి గాయం కావడంతో టి20 వరల్డ్ కప్ నుంచి అతడిని తొలగించినట్టు బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్న విషయం విధితమే. ఇవాళ మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో లేకపోవడంతో సిరాజ్‌ను తుదిజట్టులోకి తీసుకోనున్నట్టు సమాచారం. పాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.