
హైదరాబాద్ లోని నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబ్ భవనంలోని మొదటి అంతస్థులో పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నిస్తున్నారు. చుట్టు పక్కల దట్టమైన పొగ అలుముకుంది. పక్కనున్న భవనాలకు మంటలు అంటుకోకుండా ప్రయత్నిస్తున్నారు. భవనం లోపల ఇద్దరు సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ఒకరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.