Reading Time: < 1 minute

కొలంబో: టి20వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. పాక్ ముందు 148 పరగుల లక్ష్యాన్ని ఉంచింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్లలో స్కాట్ ఎడ్వర్డ్(37), బాస్ ది లీడీ(30) మైకెల్ లెవిట్(24), మ్యాక్స్ ఓడోడ్(05), కోలిన్ అకెర్మన్(20), జాక్ లైన్ కాచెట్(09), అర్యాన్ దత్(13), లగాన్ వ్యాన్ బీక్(0) పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మిజ్రా మూడు వికెట్లు తీయగా సయిబ్ అయుబ్, అబ్రార్ అహ్మద్, మహ్మద్ నవాజ్ తలో రెండు వికెట్లు తీయగా సహీన్ అఫ్రిదీ ఒక వికెట్ తీశాడు.