Reading Time: < 1 minute

హైదరాబాద్: దొంగ హామీలతో కాంగ్రెస్ మోసం చేసిందని, కొత్త రోడ్లు వేయలేదు.. ఉన్న రోడ్లు బాగు చేయలేదు అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు సంక్షేమాలు అందాయని, సిఎం రేవంత్ రెడ్డి వచ్చాక ఉన్న సంక్షేమ పథకాలన్నీ బంద్ అయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బిజెపి నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, గజ్వేల్ కు బిజెపి ఏం చేసింది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బిజెపికి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లే అని ఎద్దేవా చేశారు. రూ.200ల పెన్షన్ ను మాజీ సిఎం  కెసిఆర్ రూ.2 వేలకు పెంచారని, కాంగ్రెస్ వాళ్లు పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చారు.. పెంచారా? అని మహిళలకు రూ.2500 ఇస్తామన్నారు.. ఎవరికైనా ఇచ్చారా? అని  ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని, కెసిఆర్ పాలన వల్లే భూముల ధరలు పెరిగాయని కొనియాడారు. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు పాతాళానికి పడిపోయాయని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే మెదక్ జిల్లాకు నీరు అందుతోందని హరీశ్ రావు పేర్కొన్నారు.