
జగిత్యాల: భార్యపై అనుమానంతో ఆమెను భర్త గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మీపూర్ గ్రామంలో మల్లయ్య, సత్తవ్వ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉంది. కూమారుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. కూతురు ఇంటి వద్ద ఉండి చదువుకుంటుంది. భార్య అనుమానంతో దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి. శనివారం ఉదయం ఇంట్లో ఎవరు లేకపోవడంతో గొడ్డలి తీసుకొని నిద్రపోతున్న భార్య తల, మెడపై దాడి చేశాడు. ఆమె ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.