Reading Time: < 1 minute

స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల ‘ఇట్లు అర్జున’తో నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు, వాట్ నెక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఇది అతని మొదటి వెంచర్. అనిష్ హీరోగా మహేష్ ఉప్పల దర్శకత్వంలో, అనస్వర రాజన్ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందుతోంది. అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ ఇచ్చిన టైటిల్ గ్లింప్స్‌తో ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. అనిష్ పుట్టిన సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్, వీడియో విడుదల చేశారు. పోస్టర్‌లో అనీష్ కూల్ అండ్ చార్మింగ్‌గా కనిపించారు. ఫైండింగ్ అర్జున వాల్యూమ్ 1 వీడియో ఒక క్యారెక్టర్‌ను పరిచయం చేయడమే కాదు – ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళడానికి అనీష్ చూపించిన కమిట్‌మెంట్, మైండ్‌సెట్‌ను ఆవిష్కరిస్తుంది.