
మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి: సిరుల గని సింగరేణిని సిఎం రేవంత్‌రెడ్డి స్కామ్‌ల మయంగా మార్చారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ఎల్ పి ఉప నేత హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గం మం దమర్రి మున్సిపాలిటీలోని క్యాతన్‌పల్లిలో జరిగిన ప్రచార సభలో హరీశ్ పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్‌ను చీరి చింతకు క ట్టాలని పిలుపునిచ్చారు. లేదంటే ఐదారేళ్లలో సిం గరేణిని ఆయన ఖతం పట్టిస్తారని ఆందోళన వ్య క్తం చేశారు. బ్యాంకుల్లో అప్పు తెస్తే గాని జీతాలు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. సైట్ విజిట్ పద్ధతి తెచ్చి ఓబీ కాంట్రాక్టుల్లో వేల కోట్ల స్కామ్ చేశారని ఆరోపించారు. అనుయాయులకు టెండర్లు ఇచ్చి, కమీషన్లు పంచుకున్నారని, సైట్ విజిట్ వచ్చాక మొదటి టెండర్ రేవంతు బామ్మర్ది సృజన్ రెడ్డికి దక్కిందని, మొత్తం ఆరువేల కోట్ల టెండర్ దక్కించుకున్నారని ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలో అయిన టెండర్లు రద్దు చేసి 20 శాతం అదనం కలిపి టెండర్లు ఇచ్చారని తెలియజేశారు. తప్పు చేయకుంటే ఎందుకు విచారణ జరపరని నిలదీశారు. సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐతో కానీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ టెండర్ టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి, ఫైనాన్స్ టెండర్ 7 సార్లు తేదీలు మార్చారు. లెక్కలు కుదరడం లేదని వాయిదా వేసారు. డీజిల్ స్కాం, జిలిటెన్ స్టిక్స్ స్కాం, నైనీ కోల్ స్కాం, సోలార్ పవర్ స్కాం చేసారు. బంగారు బాతును కోసుకుతింటున్నరు. ఇట్లనే పోతే ఐదు, పదేండ్లలో సింగరేణిని ఖతం చేస్తారు.
చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే కేసీఆర్ పునరుద్దరించారు. నెల నెలా మెడికల్ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి 16,500 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక మెడికల్ బోర్డు బంద్, డిపెండెంట్ ఉద్యోగాలు బంద్, నడవలేని వారిని గుండెకు బై పాస్ సర్జరీ చేసుకున్న వాళ్లను అన్ ఫిట్ చేయడం లేదు. కార్మిక మంత్రిగా ఉన్న వివేక్.. కార్మికులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడడు అని ప్రశ్నించారు. ఏఐటీయూసీ నాయకులు, సీపీఐ నాయకులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌తో గళం కలిపేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. కార్మికులు ఇచ్చే బోనస్ కూడా బోగస్ చేసిండు రేవంత్ రెడ్డి. నిమ్స్‌కు తప్ప కార్పొరేట్ ఆసుపత్రుల్లో కార్మికులకు వైద్యం అందకుండా చేసిండు. రెండేళ్లుగా సింగరేణి సీఎండీని కూడా నియమించలేదు. సింగరేణి స్కాం బయట పెడితే తెల్లారి నాకు రేవంత్ రెడ్డి ప్రేమ లేఖ పంపిండు. నన్ను విచారణకు పిలిచిండు, నోటీసులు పంపిండు. ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ గురించి ఆయన మాట్లాడుతున్న భాషను ఒప్పుకుంటరా? ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా? అని నిలదీశారు. స్కాంల గురించి అడిగితే డైవర్షన్ స్కీంలు తెస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు డైవర్షన్ పెడుతరు అని జోస్యం చెప్పారు.