
మన తెలంగాణ/హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కేసు ను సుప్రీం కోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. తమ ఈ ఆదేశాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాటిస్తారని ఆశిస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు ధర్మాసనం వి చారణకు చేపట్టింది. స్పీకర్ ప్రసాద్ కుమార్ తరపున న్యాయవాది అ భిషేక్ సింఘ్వి కేసుపై తన వాదన వినిపిస్తూ మొత్తం పది మంది ఎ మ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో స్పీకర్ ఇప్పటికే ఎనిమిది పిటిషన్లపై స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. మరో రెండు పిటిషన్ల పై విచారణ పూర్తి చేసేందుకు మరో నాలుగు వారాల గడువు కావాలని సింఘ్వి కోరారు. ఈ దశలో బిఆర్‌ఎస్ తరఫు న్యాయవాది మో హిత్‌రావు అభ్యంతరం తెలిపారు. ఇప్పటికే నాలుగు వారాల గడువు తీసుకున్నారని, మళ్ళీ గడువు కోరుతున్నారని అన్నారు.
ఎనిమిది మంది ఎమ్మెలపై స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత మిగిలిన ఇద్దరికి నాలుగు వారాల గడువు ఎందుకంటూ అభ్యంతరం చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉంటూ లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని, ఇంత కంటే ప్రధాన సాక్షం అవసరం లేదన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తె కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసినప్పుడు బహిరంగంగా ఆ పార్టీకి ప్రచారం చేశారని, ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు. న్యాయవాది సింఘ్వి కల్పించుకుని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున గడువు కోరానని చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని మూడు వారాల గడువు ఇస్తున్నట్లు తెలిపారు. తమ ఆదేశాలను స్పీకర్ పాటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో తాము ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపడతామని చెప్పారు.