Reading Time: < 1 minute

కేవలం ప్రశ్నలు అడగడం కోసం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకూడదని, పోలీసు అధికారి అరెస్ట్ చేశారు అంటే చట్టబద్ధమైన వివక్షత తోనే చేయాలని, అది తప్పనిసరి అని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు పేర్కొంది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బిఎన్ ఎస్ ఎస్) 2023 నిబంధనల ప్రకారం పోలీసు అధికారి అధికారాలను కేవలం సౌకర్యం కోసం కాకుండా, స్పష్టమైన అవసరంగా భావించాలని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్ కె సింగ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అంటే, పోలీసు అధికారి కేవలం ప్రశ్నలు అడగడానికి అరెస్ట్ చేయవచ్చని దీని అర్థంకాదని ధర్మాసనం తెలిపింది.ఓ వ్యక్తి కనీసం ఏడు సంవత్సరాల శిక్ష పడే కేసుకు సంబంధించి నేరంలో ప్రశ్నించాల్సినప్పుడు అతడిని అరెస్ట్ చేస్తే తప్ప, కేసు ముందుకు సాగదని పోలీసు అధికారి సంతృప్తి పడినప్పుడే, అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

ఇందుకు విరుద్ధంగా ఏదైనా వివరణ ఇస్తే, బిఎన్‌ఎస్‌ఎస్ 2023 లోని సెక్షన్లు 35(1)(బి), సెక్షన్లు 35(3)నుంచి 36(6) వరకూ ఉన్న ఉద్దేశ్యాలకు భిన్నంగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీల్ ను విచారిస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ ఆదేశాలను జారీ చేసింది. ఏడు సంవత్సరాలవరకూ శిక్ష విధించదగిన నేరానికి సంబంధించిన అన్ని కేసులలో బిఎన్‌ఎస్‌ఎస్ 2023 లోని సెక్షన్ 35(3) కింద నోటీసులు తప్పనిసరిగా జారీ చేయాలా వద్దా అన్న ప్రశ్నను నిర్ణయిస్తున్నది. సెక్షన్ 35(3) కింద జారీ చేసిన నోటీసు ప్రకారం నిబంధనల ప్రకారంఅరెస్ట్ చేసే అధికారం పోలీసు అధికారి అధికారాల వినియోగంలో ఆయన వివక్షతపై ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.