
హరారే: అండర్-19 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో తొలుతు బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 411 పరుగుల భారీ స్కోర్‌ను సాధించింది. అయితే ఈ లక్ష్య చేధనలో ఇంగ్లండ్ తడబడుతోంది. ఓపెనర్ బెన్ డాకిన్స్ (66), బెన్ మెయిస్(45) కెప్టెన్ థామస్ రేవ్(31) పరుగులతో ఫర్వాలేదు అనిపించినా.. మిగితా బ్యాటర్లు భారత బౌలింగ్ ధాటికి పెవిలియన్ బాట పట్టారు. దీంతో 25 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఇంగ్లండ్ ఇంకా 214 పరుగులు చేయాల్సి ఉంది.