Reading Time: < 1 minute

ఫిబ్రవరి 7 నుంచి టి-20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈసారి ట్రోఫీని అందుకోవాలని ప్రతీ టీం ఆశ పడుతోంది. అయితే రేపు (ఫిబ్రవరి 7) యుఎస్‌ఎతో మ్యాచ్ ఉండగా.. భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. జట్టు కీలక ఆటగాడు హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడని సమాచారం.

సౌతాఫ్రికాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో రాణా మోకాలికి గాయమైంది. వెంటనే ఫిజియో వచ్చి వైద్యం చేసిన అతడు కోలుకోలేకపోయాడు. దీంతో మ్యాచ్ మధ్యలో కుంటుతూనే మైదానం వీడాడు. ఆ తర్వాత అతడికి స్కానింగ్‌లు నిర్వహించగా.. తీవ్రమైన గాయం జరిగినట్లు తేలింది. అతడికి కొన్ని వారాలపాటు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు. దీంతో రాణా టి-20 ప్రపంచకప్‌కి అందుబాటులో లేకుండా పోయాడని తెలుస్తోంది. అయితే హర్షిత్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కానీ, హర్షిత్ లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.