
వడోదర: 2026 మహిళల ప్రీమియర్ లీగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచిన విషయం తెలిసిందే. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో డబ్ల్యూపిఎల్ ట్రోఫీని రెండోసారి సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్‌సిబి మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టును అభినందిస్తూ.. సెలబ్రిటీలు, అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
కాగా, ఆర్‌సిబి (పురుషుల) జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, మహిళల జట్టును అభినందిస్తూ.. పోస్ట్ పెట్టాడు. మరోసారి ఛాంపియన్లుగా నిలిచి ఆర్‌సిబి జెండాను ఉన్నతంగా ఎగురవేశారు. మీలో ప్రతి ఒక్కరూ.. గర్వపడదగిన విజయం సాధించారు. స్మృతి, మొత్తం జట్టు, మేనేజ్‌మెంట్ బృందానికి ఈ అద్భుతమైన విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఈ గెలుపునకు నిస్సందేహంగా అర్హులు. ఈ అద్భుతమైన క్షణాన్ని ఆస్వాదించండి. అభిమానుల ప్రేమను స్వీకరించండి’’ అంటూ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.