
అమరావతి: కానిస్టేబుల్‌పై గ్యాంగ్ రేప్ నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తురు మండలం ఎర్రకొండ అటవీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగేంద్ర అనే వ్యక్తి అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ పాల్పడ్డాడు. దీంతో హిందూపురం పోలీసులు నాగేంద్ర కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రకొండ అటవీ ప్రాంతంలో నాగేంద్ర కనిపించడంతో కానిస్టేబుల్ రవి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. రవిపై నిందితుతు కత్తితో దాడి చేశాడు. వెంటనే సిఐ నిందితుడి కాలుపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. వెంటనే కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు నాగేంద్రపై ఎపిలో 90కి పైగా కేసులు ఉన్నాయి.