Reading Time: < 1 minute

ఢిల్లీ: విద్యార్థులు నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఒత్తిడిని అధిగమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని అన్నారు. ఢిల్లీలో పరీక్షా పే చర్చా కార్యక్రమంలో విద్యార్థులతో మోడీ ముచ్చటించారు. ఏకాగ్రతతో చదివితే నేర్చుకున్నది ఎప్పటికీ గుర్తుంటుందని, పౌష్టికాహారం తింటూ తగినంత నిద్రపోవాలని సలహా ఇచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారం చదివితే సులువుగా ఉంటుందని, జీవితంలో ప్రతి విషయంలోనూ సమతుల్యత ఉండాలని తెలియజేశారు. విద్య ద్వారానే జీవిత, వృత్తిపర నైపుణ్యాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మన లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని, లక్ష్య సాధనలో ఎప్పుడూ రాజీ పడొద్దు అని మోడీ సూచించారు. ఈ కాలం విద్యార్థులకు టెక్నాలజీ ఎన్నో సమకూరుస్తుందని, ఎఐ సహాయంతో సమస్యలను వేగంగా పరిష్కరించుకోవచ్చని అన్నారు. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే మెదడు చురుకుగా పనిచేస్తుందని మోడీ స్పష్టం చేశారు.