Reading Time: < 1 minute

రాయ్ పూర్: మహారాష్ట్ర- ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భమ్రగడ్ తాలూకా ఫడేవా అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగింది. ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.